
‘ప్రమాదం పొంచి ఉంది’
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అక్టోబరు 2న జరిగిన కొండ చరియలు విరిగిపడిన ఘటనలో రాయగఢ బ్లాక్‌లో పెక్కట గ్రామంలో తండ్రీకొడుకులు ఇద్దరు మృతిచెందారు. అలాగే మోహనా, ఆర్.ఉదయగిరి బ్లాక్‌లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఒడిశాలో ఇక్కడే ప్రత్యేకంగా కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఇలాం ప్రకృతి వైపరీత్యాలు మళ్లీ జరగకుండా జిల్లా యంత్రాంగం ఒక జియోలాజికల్ సర్వే చేపట్టాలని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరుతున్నారు. ఆల్ ఇండియా ల్యాండ్‌స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాప్ (ఐ.ఎల్.యస్.యం), ఐఐటీ, ఢిల్లీ విద్యార్థులు జరిపిన సర్వేలో గజపతి జిల్లాలో 129 కొండచరియలు విరిగిపడే లోకేషన్లు ఉన్నట్లు గుర్తించారు. మోహనా, నువాగడ, ఆర్.ఉదయగిరి, రాయగడ సమితి కేంద్రాల్లో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు. ఏటవాలు ప్రాంతంలో పోడు వ్యవసాయం ఎక్కువగా చేస్తూ మొక్కజొన్న, వరి, రాగులు, కాయగూరల పంటలు పండిస్తూ జీవిస్తున్నారు. అయితే పర్యావరణ శాస్త్రవేత్తలు గజపతి జిల్లాలో సుమారు కొండ చరియలు విరిగిపడే 129 అపాయకర ప్రాంతాలను గుర్తించారు. అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కోరుతున్నారు. అక్టోబర్‌లోనే గజపతి ఎక్కువగా వానలు కురుస్తుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సైతం ఇదే మాసంలో సంభవిస్తుంటాయి. అక్టోబరు 15 నుంచి వాయవ్య బంగళాఖాతంలో తిరిగి అల్పపీడనం సంభవించనున్న దృష్ట్యా ఒడిశాలో పలు జిల్లాలో అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

‘ప్రమాదం పొంచి ఉంది’

‘ప్రమాదం పొంచి ఉంది’