
ఈపీఎఫ్ పెన్షనర్ల డిమాండ్లు నేరవేర్చాలి
జయపురం: ఈపీఎఫ్ పింఛన్‌దారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళనలు చేస్తామని కార్మిక నేత, సేవా పేపరు మిల్లు కార్మిక సంఘ అద్యక్షులు ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు. సోమవారం స్థానిక యాదవ భవనంలో కొరాపుట్ జిల్లా ఈపీఎఫ్ పెన్సనర్ల అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షులు నళినీకాంత రథో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈపీఎఫ్ పెన్సన్ దారులకు నెలకు కనీసం తొమ్మిది వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఉచిత వైద్య సేవలు సమకూర్చాలని, డీఏ పెంచాలని ఎన్నో ఆందోళనలు జరుపుతున్నప్పటికీ ప్రయోజనం లేదన్నారు. నవంబర్ 16వ తేదీన దేశ వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లలకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వెల్లడించారు. సమా వేశంలో జిల్లా ఆర్గనైజర్ దుర్గప్రసాద్ దాస్, సభ్యు లు పి.గౌరీశంకరరావు, బసంతరావు, జి.ప్రసాదరా వు, కిశోర్ చంద్రపండా, సువర్ణ బిశాయి, భాస్కర మిశ్ర పాల్గొన్నారు.