
పాఠశాలకు తాళాలు
జయపురం:
జయపురం సబ్‌డివిజన్ కుంద్ర సమితి కెరమెటి గ్రామ పంచాయతీ కొంఠపొదర్ ప్రాథమి క పాఠశాలలో ఉపాధ్యాయురాలు గాయత్రీ ధరువ ని మరో గ్రామంలో పాఠశాలకు బదిలీ చేయటాన్ని ఆ గ్రామ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. వెంట నే ఆమె బదిలీ ఆర్డర్‌ను రద్దు చేసి ఆమెను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల అభ్యర్థనను అధికారులు పట్టించుకొక పోవడంతో సోమవారం పాఠశాలకు గ్రామస్తులు, పాఠశాల పరిచాలన కమిటీ సభ్యులు కలిసి తాళాలు వేశారు. 6 నెలల కిందట ఉపాధ్యాయురాలు గాయత్రి ధురువను బదిలీ చేశారని వెంటనే ఆమె బదిలీని రద్దు చేయాలని తాము బ్లాక్ విద్యాధికారికి రెండు పర్యాయాలు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. అలాగనే కొరాపుట్ జిల్లా కలెక్టర్‌కు రాసిన వినతిని కుంద్ర సమితి బ్లాక్ అదనపు విద్యాధికారి పొపెయి బెహర కు అందజేశామని వెల్లడించారు. గత మే 3వ తేదీ న, జూన్ 6వ తేదీన బ్లాక్ విద్యాధికారికి ఉపాద్యాయురాలు ధరువ మదిలీ రద్దు చేయాలని వినతు లు అందజేశామన్నారు. రెండు నెలల్లో సమస్య పరిస్కరిస్తామని బీఈఓ హామీ ఇచ్చారని, ఆమె బదిలీ అయ్యి 6 నెలలు గడచినా నేటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. మరో మార్గంలేక పాఠశాలకు తాళాలు వేశామని వెల్లడించారు. ఈ సంఘటనతో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు డు గుప్త చంద్ర భుయ్, బీఈఓకు తెలియజేశారు. తరువాత ఏబీఈఓ పొపెయి బెహరా, సీఆర్‌సీసీ సంజయ సామంతరాయ్, సమితి ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు త్రినాథ్ పండా, ఉపాధ్యక్షుడు రాకేష్ చంద్రగురు, పాఠశాలకు వచ్చి పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు లభి సాంత, గ్రామస్తులతో చర్చలు జరిపారు. వారం రోజుల్లో ఉపా ధ్యాయురాలుని తిరిగి పాఠశాలకు తీసుకువస్తామ ని హామీ ఇచ్చారు. గ్రామస్తులు ససేమిరా అంటూ పాఠశాల తాళాలు తీసేది లేదంటూ భీష్మించారు. అనంతరం బీఈఓ రఘునాథ్ పంగితో ఫోన్ ద్వారా మాట్లాడించగా ఆయన ఇచ్చిన హామీతో పాఠశాల తాళాలు తీశారు. వారం రోజుల్లో ఉపాధ్యాయురా లు పాఠశాలకు రాకపోతే మరలా తాళాలు పాఠశాలకు వేస్తామని, ఉపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చేంత వరకు తాళాలు తీసేది లేదని హెచ్చరించారు.

పాఠశాలకు తాళాలు