
26 వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల ఎన్‌ఏ సీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధాన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. బలిమెల కోరుకొండ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు వినతిపత్రాలు అందించారు. 26 వినతులను అధికారులు స్వీకరించారు. ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ సభరో, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భువనేశ్వర్: పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును స్థానిక పార్లమెంటు సభ్యురాలు అపరాజిత షడంగి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరివురి మధ్య కొనసాగిన సంభాషణలో భువనేశ్వర్ బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3వ టెర్మినల్ నిర్మాణం ఆమోదం కోసం ఆయనను అభ్యర్థించారు. భువనేశ్వర్ నుంచి పలు ప్రముఖ ప్రాంతాలకు రాకపోకల కోసం విమానాల అవసరం గురించి ఎంపీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వీరిరువురి మధ్య సానుకూల చర్చ సాగినట్లు ఎంపీ తెలిపారు. ఈ దిశలో తదుపరి చర్యలు పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు.
రాయగడ: క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బీజేపీ నాయకుడు యాల్ల కొండబాబు ఆకాంక్షించారు. జిల్లాలోని కొలనారలో సోమవారం కొలనార ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కొండబాబు మాట్లాడుతూ క్రీడాకారులకు ఇటువంటి తరహా పోటీలు వారి ప్రతిభ ను కనబరుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయన్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంటులో నాలుగు జట్లు పాల్గొన్నాయి. ప్రతీ జట్టు నాలుగు సార్లు పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. బీజేపీ నాయకులు చక్రధర్ బిడిక, బిరజా పాత్రో, తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో మూడు రోజులుగా జరుగుతు న్న పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం సుప్రభా త సేవ, శాత్తుమురై, తీర్ధ గొష్టి, సాయంత్రం పూర్ణాహుతి, తిరువీధి, పవిత్ర విసర్జన కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యు లు ఆధ్వర్యంలో మూడు రోజుల పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి.
వివాహిత అదృశ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఒక వివాహిత అదృశ్యమైనట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. గార మండలం కళింగపట్నానికి చెందిన సంతోషి(21)కి విజయవాడకు చెందిన భక్తుల వెంకటేశ్వరరావుతో నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. తరచూ ఫోన్‌లో గడపడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆరు నెలల క్రితం కళింగపట్నంలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈనెల 8వ తేదీన విజయనగరంలో పండగకు కుమార్తె బయల్దేరడంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సులో బస్సు ఎక్కించానని తల్లి వనుము సూరమ్మ తెలిపారు.

26 వినతుల స్వీకరణ

26 వినతుల స్వీకరణ

26 వినతుల స్వీకరణ