
దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా పోడియ సమితిలో దొంగతనం కేసులో ఉన్న ఇద్దరు నిందితులను పోడియా ఐఐసీ రామేశ్వర్ ప్రధాన్ సోమవారం అరెస్టు చేశారు. గత ఏడాది కలిమెల సమితి ఉండ్రుకొండ పంచాయతీ అడవి మార్గంలో ఫైనాస్స్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుంచి కత్తులు చూపి కలెక్షన్ చేసిన నాలుగు లక్షల రూపాయల నగదును దొంగలించారు. కేసు నమోద్ చేసి దర్యాప్తులో ఉంది. ఆదివారం రాత్రి నిందితులు రవి దళపతి, రవీంద్ర దళపతిగా గుర్తించారు. ఈ ఇద్దరు బలిమెల ప్రాంతానికి చెందిన వారు అని తెలుసుకున్న పోడియా పోలీసులు వారిని అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించారు. వీరిపై కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలిస్తామని ఐఐసీ తెలిపారు.