
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
రాయగడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన జిల్లాలోని రామనగుడ సమితి గొసాయిగులుముండ పంచాయతీలోని పొలుపాయి గ్రామ మలుపులో సోమవారం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రామనగుడ పీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్‌పై రేఖాగుడ గ్రామం నుంచి రాయగడ సమితి గుమ్మ గ్రామానికి తమ బంధువుల ఇంటికి వెళుతున్న సమయంలో పొలుపాయి మలుపులో ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ను అదుపు తప్పి ఢీకొనడంతో పక్కనే గల లోయలోకి పడిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం