
రౌర్కెలా హై టెక్ ఆస్పత్రిలో జన ఔషధి ప్రారంభం
భువనేశ్వర్: రౌర్కెలా హైటెక్ వైద్య కళాశాల, ఆస్పత్రి ఆవరణలో ప్రధాన మంత్రి జన ఔషధి విక్రయ కేంద్రం ప్రారంభించారు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయెల్ ఓరాం చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. రౌర్కెలా ఎమ్మెల్యే శారదా ప్రసాద్ నాయక్, రఘునాథ్‌పల్లి ఎమ్మెల్యే దుర్గా చరణ్ తంతి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అన్ని వర్గాల రోగులకు సులభంగా, సరసమైన ధరలకు ఈ కేంద్రంలో మందులు లభిస్తాయి. రౌర్కెలా ఆస్పత్రిలో సకాలంలో సముచిత వైద్యం లభించడంతో సరసమైన ధరలకు జన ఔషధి విక్రయ కేంద్రంలో నాణ్యమైన మందులు దొరుకుతాయన్నారు. హైటెక్ వైద్య కళాశాల ఆస్పత్రి వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి హాజరై ఆస్పత్రిలో చికిత్స పొందే రోగులు కొత్తగా ప్రారంభించిన జన ఔషధి కేంద్రం సేవల్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు.

రౌర్కెలా హై టెక్ ఆస్పత్రిలో జన ఔషధి ప్రారంభం