పవిత్ర క్షేత్రం పూరీ | - | Sakshi
Sakshi News home page

పవిత్ర క్షేత్రం పూరీ

Oct 14 2025 6:51 AM | Updated on Oct 14 2025 6:51 AM

పవిత్

పవిత్ర క్షేత్రం పూరీ

● ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
● ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి
ఇంజినీరింగ్‌ చదివి.. గంజాయి స్మగ్లర్‌గా మారి

భువనేశ్వర్‌:

విత్ర కార్తీక మాసం పురస్కరించుకుని రాష్ట్రం మారుమూల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన హబిష్యాలీలతో చతుర్థామ క్షేత్రం పూరీ కళకళలాడుతోంది. కార్తీక మాసంలో నెల రోజులపాటు నిరవధికంగా ప్రత్యేకంగా వ్రతం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో వితంతు మహిళలు తరలి వచ్చారు. వీరందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో ఉచిత వసతి, మహా ప్రసాదం, దర్శనం కోసం ప్రత్యేక రవాణా తదితర ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పట్టణంలో 5 వేర్వేరు చోట్ల వీరి కోసం ఆరోగ్యం, పటిష్టమైన భద్రత, రక్షణ వ్యవస్థతో ఉచిత వసతి సముదాయాలు ఏర్పాటు చేశారు. కార్తీక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి హబిష్యాలీలు బస చేసిన బృందావతి సముదాయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాలుగా కార్తీక మాసాన్ని భక్తి మాసంగా పరిగణిస్తారు. ఒడియా మహిళలు ఈ పవిత్ర మాసంలో హవిష్యం పాటించడం తరతరాల సంప్రదాయంగా కొనసాగుతుంది. అత్యంత నియమ నిష్టలతో రాధా దామోదరుల్ని సేవిస్తూ శ్రీ జగన్నాథుని మహా ప్రసాదం (ఒబొఢ)తో నిత్యం ఒంటి పూట భోజనం చేయడం కోసం అనుకూలమైన సదుపాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏటా మాదిరిగా ఈ ఏడాది ఏర్పాటు చేసిందన్నారు. హబిష్యాలీలు నియమ నిష్టలతో సుదీర్ఘంగా నెల రోజులపాటు నిర్వహించే కార్తీక వ్రతంతో పరిసరాలు పవిత్రంగా మారుతాయన్నారు. కార్తీక వ్రతం ఒడిశాకు చెందిన ఒక జీవన సంస్కృతి, ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అని అన్నారు. ఈ వ్రతం ఆచరించేందుకు చాలా మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి ఒంటరిగా వస్తారు. వారు తమ కుటుంబాలను విడిచిపెట్టి ఇక్కడ ఒక నెల రోజులు గడుపుతారు. లోక కల్యాణం కోసం వారు దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసంలో వీరు వెలిగించే దీపాలు రాష్ట్ర నైతిక, ఆధ్యాత్మిక భావాలను మేల్కొల్పుతాయి. పూరీ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. ఈ పవిత్ర క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథుడు భక్తుల నడుమ ప్రత్యక్షమై అడుగడుగున వేస్తు పుణ్య బాటలో నడపిస్తాడని భక్తులు గట్టిగా విశ్వసిస్తారు. ఈ పవిత్ర స్థలంలో భక్తులకు సేవ చేయడం ప్రభుత్వ విధి. ఈసారి పూరీలోని 5 ప్రదేశాలలో 2 వేల 500 మందికి పైబడి హబిష్యాలీల కోసం వసతి, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యకలాపాల కోసం ప్రభుత్వం రూ. 3.3 కోట్ల వ్యయ ప్రణాళికని రూపొందించినట్లు తెలిపారు. ఇది గత సంవత్సరం కంటే రూ. 70 లక్షలు అధికంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పూరీ జిల్లా యంత్రాంగం ఔత్సాహికుల కోసం సౌకర్యాలను కల్పిస్తోంది. ఎమ్మెల్యే ఓం ప్రకాష్‌ మిశ్రా, పూరీ ఎంపీ డాక్టర్‌ సంబిత్‌ పాత్రో, జగత్‌సింగ్‌పూర్‌ ఎంపీ బిభు ప్రసాద్‌ తొరాయ్‌, పిప్పిలి ఎమ్మెల్యే అశ్రిత్‌ పట్నాయక్‌, పూరీ ఎమ్మెల్యే సునీల్‌ మహంతి, బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహాపాత్రొ, జిల్లా కలెక్టర్‌ దివ్య జ్యోతి పరిడా, పోలీసు సూపరింటెండెంట్‌ ప్రతీక్‌ సింగ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పవిత్ర క్షేత్రం పూరీ1
1/6

పవిత్ర క్షేత్రం పూరీ

పవిత్ర క్షేత్రం పూరీ2
2/6

పవిత్ర క్షేత్రం పూరీ

పవిత్ర క్షేత్రం పూరీ3
3/6

పవిత్ర క్షేత్రం పూరీ

పవిత్ర క్షేత్రం పూరీ4
4/6

పవిత్ర క్షేత్రం పూరీ

పవిత్ర క్షేత్రం పూరీ5
5/6

పవిత్ర క్షేత్రం పూరీ

పవిత్ర క్షేత్రం పూరీ6
6/6

పవిత్ర క్షేత్రం పూరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement