
గురండి గ్రీవెన్స్‌కు 108 వినతులు
పర్లాకిమిడి: గుసాని సమితి గురండి పంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్సుసెల్‌కు విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ మధుమిత అధ్యక్షత వహించగా, అదనపు ఎస్పీ సునీల్ కాంత మహాంతి, డీఆర్‌డీఏ ముఖ్య కార్యనిర్వాహణాధికారి శంకర్ కెరకెటా తదితరులు హాజరయ్యారు. గురండి పంచాయతీతో పాటు తాటిపట్టి, పెద్ద గుసాని, బుసుకుడి గ్రామ పంచాయతీల నుంచి 108 వినతులు అందాయి. వాటిలో వ్యక్తిగతం 64 కాగా, గ్రామ సమస్యలు, అభియోగాలు 44 వచ్చాయి. వాటిని సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం 12 మందికి వసుంధర భూపట్టాలను కలెక్టర్ గురండిలో అందజేశారు. గురండి పంచాయతీ కార్యాలయం ఆవరణలోని అంగన్‌వాడీల రాష్ట్రీయ పోషణ స్టాల్‌ను కలెక్టర్ సందర్శించారు. గుసాని బీడీవో గౌర చంద్ర పట్నాయక్, తహసీల్దార్ నారాయణ బెహరా, సీడీఎంవో డాక్టర్ ఎం.ఎం.ఆలీ పాల్గొన్నారు.

గురండి గ్రీవెన్స్‌కు 108 వినతులు