
‘గదబ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి’
జయపురం:
కొరాపుట్ జిల్లాలో గదబ సంప్రదాయ గిరిజనుల భాష, సంస్కృతి సంప్రదాయం పరిరక్షణకు సామూహిక ఉద్యమం అవసరమని రాష్ట్ర విధాన సభలో కాంగ్రెస్ నేత, పొట్టింగి ఎమ్మెల్యే రామచంద్ర కడమ్ అన్నారు. సోమవారం జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడలో గదబ సమాజ్ వికాశ పరిషత్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వికాస పరిషత్ అధ్యక్షుడు మోహణ్ శ్రీకరలియ అధ్యక్షతన నిర్వహించిన వార్షిక సమావేశంలో రామచంద్ర కడమ్ ప్రసంగిస్తూ కొరాపుట్ జిల్లాలో గదబ సంప్రదాయ గిరిజనులు పురాతన తెగ అని, వారి నృత్య సంగీతాలకు సమాజంలో ప్రత్యేక ఆదరణ ఉందని అయితే వారికి ప్రభుత్వం తగిన సహకారం అందించక పోవటం వల్ల కళలు కనుమరుగు అవుతున్నాయని వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వార్షికోత్సవం సందర్భంగా బొయిపరిగుడలోగల సహిద్‌లక్ష్ మణ నాయిక్ పాఠాఘర్ ప్రాంగణంలో నిర్వహించిన వార్షికోత్సవంలో మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగు ఖిళో, గదబ సమాజ్ వికాస పరిషత్ సీనియర్ నేత ముకుంద హంతాల్, భగీరథ్ ముర్జయ, జితేంధ్ర నాయిక్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

‘గదబ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి’

‘గదబ సంప్రదాయాన్ని కాపాడుకోవాలి’