
రాకపోకలు బంద్
పర్లాకిమిడి: గజపతి జిల్లా మోహనా సమితి మలాస్ పదర్ గ్రామ పంచాయతీ భలియగుడలో ఇటీవల విజయదశమి రోజు కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారి మోహనా– బోడోగోడో రోడ్డుకు అనుసంధానం కరియంబు జంక్షన్ వద్ద కల్వర్టు కూలింది. మూడు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టు కూలిపోవడంతో పంట భూములు వరదనీటితో నిండిపోయి ఽజొన్న, మొక్కజొన్న, ఽవరి, రాగు పంటలు నాశనం అయ్యాయి. ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు, మోహనా బ్లాక్ అభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయినా.. అధికారులు మలాస్ పదర్, భలియగుడ గ్రామాలను సందర్శించలేదని ప్రజలు చెబుతున్నారు. మూడు నెలల క్రితం జిల్లా కలెక్టర్ మధుమిత భలియాగుడ సందర్శించినప్పుడు పేదలకు పి.ఎం. యోజన పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికై నా మలాస్ పదర్ గ్రామ పంచాయతీలో భలియా గుడలో ప్రజలు కష్టాలు వినాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రాకపోకలు బంద్

రాకపోకలు బంద్