
ఉత్సాహంగా స్కూల్‌గేమ్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీల ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఎంపికలు చేపట్టారు. ఐదురోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు 12 క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. హాకీ ఎంపికలు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో, వెయిట్‌లిఫ్టింగ్– పెద్దపాడులో, రెజ్లింగ్– పెద్దపాడులో, ఆర్చరీ– రాజ్‌కుమార్ అకాడమీ శ్రీకాకుళంలో, రగ్బీ, నెట్‌బాల్, రోప్‌స్కిప్పింగ్, షూటింగ్‌బాల్ ఎంపికలు– టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, టేబుల్‌టెన్నిస్– శాంతినగర్‌కాలనీలో డీఎస్‌ఏ ఇండోర్ స్టేడియం, యోగా– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం, లాన్‌టెన్నీస్– శ్రీకాకుళం ఆర్ట్స్‌కాలేజ్ టెన్నిస్ అకాడమీలో, కరాటే ఎంపికలు శ్రీకాకుళం మహాలక్ష్మినగర్‌కాలనీలోని శ్రీచైతన్య స్కూల్ వేదికగా ఎంపికలను పూర్తిచేశారు. త్వరలో తుది జట్ల జాబితాను ప్రకటిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎస్‌జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు పర్యవేక్షించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సలహాదారు పి.సుందరరావు, ఆయా క్రీడాంశాల సెలక్టర్లు, పీడీ, పీఈటీలు ఎంపికలను నిర్వహించారు.
యోగా క్రీడాకారుల ఎంపికలు
నరసన్నపేట: స్కూల్ గేమ్స్‌లో సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో యోగా పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ సలహాదారు కె.రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో సత్యవరం స్కూల్ నుంచి బి.జస్వంత్, బి.రాజ్వణి, ఆర్. రమేష్‌లు ఎంపికయ్యారని ఎంఈఓ శాంతారావు తెలిపారు. పీఈటీలు జ్యోతీ రాణి, లక్ష్మణరావు పాల్గొన్నారు.
టెక్కలి: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా జట్లు ఎంపికలను ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. అండర్ –14, 17, 19 విభాగాల్లో బాల బాలికలకు నెట్‌బాల్, రగ్బీ, రోప్ స్కిప్పింగ్, షూటింగ్ బాల్ తదితర విభాగాల్లో జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. 95 పాఠశాలల నుంచి 650 మంది విద్యార్థులు హాజరయ్యారు. టెక్కలి డివిజన్ ఇన్‌చార్జి బి.నారాయణరావు, పీడీలు కె.కె.రామిరెడ్డి, ఎస్.లక్ష్మణరావు, ఎస్.కృష్ణారావు, ఎన్.నాగరాజు, పి.వెంకటరమణ, డి.లక్ష్మినారాయణ, అలివేణి, నర్మద పర్యవేక్షించారు.