
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా మో
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్–2025 పోటీలకు టెక్నికల్ అఫీషియల్ (లైన్ జడ్జి)గా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు మోహన్‌సాయినాథ్ నియామకమయ్యారు. ఈ పోటీలు అసోంలోని గౌహతి వేదికగా ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన అంతర్జాతీయ క్వాలిఫైడ్ రిఫరీ, శ్రీకాకుళం జిల్లా బాడ్మింటన్ సీఈఓ సంపతిరావు సూరిబాబు కుమారుడు. తండ్రీకొడుకు లు ఇద్దరూ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్లగా నియామకం కావడం విశేషం.
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్‌లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు.