
ఐటీఐ ఉత్తమ ఉత్తీర్ణులకు ప్రధాని సత్కారం
భువనేశ్వర్: వృత్తి విద్యా (ఐటీఐ) కోర్సులో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు విద్యార్థులు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ స్థాయి మేటి విద్యార్థులుగా ప్రత్యేక బహుమానాలు అందుకున్నారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి వీరివురికి జాతీయ స్థాయి పురస్కారాలు అందజేశారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్‌లో 2025 జాతీయ స్థాయి టాపర్ అవార్డుతో కంధమల్ జిల్లా ఫుల్బాణి ప్రభుత్వ ఐటీఐ నుండి ప్రమోద్ దళపతి, గంజాం జిల్లా హింజిలికట్ ఐటీఐ ప్రభుత్వ పూర్వ విద్యార్థి, ఎన్‌ఎస్‌టీఐ భువనేశ్వర్ విద్యార్థి జితేంద్ర ప్రధాన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పరీక్షలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించి ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రత్యేక బహుమానం పొందారు.

ఐటీఐ ఉత్తమ ఉత్తీర్ణులకు ప్రధాని సత్కారం