
వంతెన కొట్టుకుపోయినా పట్టని అధికారులు
పర్లాకిమిడి: తీవ్ర వర్షాలకు గజపతి జిల్లా గుమ్మాబ్లాక్ అశ్రియగడ, బురిడి గ్రామ పంచాయతీలకు కలుపుతూ ఉన్న వంతెన కూలి పోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకూ గుమ్మా బ్లాక్ బీడీవో, తహసీల్దార్ అశ్రియగడ గ్రామాన్ని సందర్శించలేదు. గుమ్మా సమితి కేంద్రానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న అశ్రియగడలో వరదలకు వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. కాగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి ఆదివారం అశ్రియగడను సందర్శించి ప్రజలతో మాట్లాడి, అధికారులకు ఫోన్ చేశారు. వెంటనే వంతెన మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరుకు ఫోన్ చేసి ఆదేశించారు.

వంతెన కొట్టుకుపోయినా పట్టని అధికారులు