
బయటపడిన కారు, శవం
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి వద్ద నాలుగు రోజుల కిందట భారీ వర్షాలకు కలియాతుట్ట నదిలో ఒక కారు కొట్టుకుపోయింది. నదిలో వరద నీరు తగ్గడంతో కారును అగ్నిమాపక దళం బయటకు తీసింది. అందులో వ్యక్తి శవం లభ్యమైంది. కారులో ఇరుక్కుని మృతిచెందిన వ్యక్తి ప్రతాప్ పండా (50) గా ఆర్.ఉదయగిరి ఎస్‌ఐ సందీప్ హేంబ్రం తెలియజేశారు. దసరా నాడు ప్రతాప్ పండా ఆర్.ఉదయగిరికి దగ్గరలో ఉన్న తరబా గ్రామంలో తన దుకాణం పూజ కోసం వెళ్లి కారుతో సహా కొట్టుకుపోయాడు. ఆయన ఆచూకీ కోసం వెదకగా ఈ రోజు నదిలో వరద నీరు తగ్గటంతో కారుతో సహా దొరికాడు. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.

బయటపడిన కారు, శవం