
బస్సు, ట్రక్ ఢీ ఒకరు మృతి
● 20 మందికి గాయాలు
కొరాపుట్: ప్రైవేటు బస్సు, ట్రక్ ఎదురెదురుగా ఢీకున్న సంఘటనలో ఒకరు మృతి చెందగా 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. నబరంగ్‌పూర్ జిల్లా సరిహద్దులో జాతీయ రహదారి–26పై పపడాహండి సమితి కేంద్రానికి చివర్లో అంపానీ ఘాట్‌లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భవానీపట్న నుంచి నబరంగ్‌పూర్ వైపు బస్సు వస్తుండగా.. ఇదే సమయంలో ట్రక్ పపడాహండి నుంచి భవానీ పట్న వైపు వెళ్తుంది. ఘాట్‌లో మలుపు వద్ద రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రక్ డైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పపడాహండి, అంపానీల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పపడాహండి, నబరంగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. మృతి చెందిన ట్రక్ డ్రైవర్ పశ్చిమ బంగా వాసి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.