
కత్తి, డాలు కోటలోకి తరలింపు
పర్లాకిమిడి: పట్టణంలోని అంకావీధిలో గల గజపతుల ఇలవేల్పు మాణికేశ్వరీ దేవికి గత 16 రోజులపాటు నిర్వహించిన దసరా వేడుకలు మూలష్టమి అయిన సోమవారంతో ముగిశాయి. గజపతుల వంశీయులు కళ్యాణి గజపతి లేకపోవడంతో రాజమందిరంలో సేవకులు, ప్రధాన అర్చకులు మేళతాళలతో అంకావీధిలోని మాణికేశ్వరీదేవి మందిరానికి వచ్చి పార్శ్వభాగంలో ఉన్న కనకదుర్గ కత్తి, డాలును ప్రధాన పూజారి రఘుపాత్రో తీసుకుని కోటలోకి వెళ్లి శాసీ్త్రయంగా పూజలు జరిపారు. తిరిగి అమ్మవారి కత్తి, డాలును మాణికేశ్వర మందిరంలో యథాస్థానంలో పెట్టారు. ఈ రాత్రికి అమ్మవారికి కోడిపుంజును బలిచేసి నైవేద్యం పెడతారు. ఆనాదిగా వస్తున్న ఈ ఆచారాన్ని గత వందేళ్లకు పైగా నిర్వహిస్తున్నారు. పర్లాకిమిడిలో ఈ ఒక్క మాణికేశ్వర మందిరంలో మార్పులు (చేపలు), నీసు వంట అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. వచ్చే విజయదశమి వరకు కనకదుర్గ, అమ్మవారికి పూజలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు.

కత్తి, డాలు కోటలోకి తరలింపు

కత్తి, డాలు కోటలోకి తరలింపు

కత్తి, డాలు కోటలోకి తరలింపు