
శ్రీ మందిరం శిఖరాన డ్రోన్ చక్కర్లు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథుని మందిరం భద్రతా సర్వత్రా ఆందోళనకరంగా మారుతోంది. శ్రీ మందిరం ప్రాంగణం నో ఫ్లయింగ్ జోన్. ఈ పరిసరాల్లో డ్రోన్ వ్యతిరేక వ్యవస్థ పని చేస్తుందని జిల్లా భద్రత, రక్షణ వర్గాలు తరచూ ప్రకటిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఇలా ఉండగా ఎప్పటికప్పుడు శ్రీ మందిరం శిఖరంపై డ్రోన్‌లు చక్కర్లు కొడుతూ భద్రతా వ్యవస్థకు సవాలు విసురుతున్నాయి. ఇలాంటి సంఘటన ఆదివారం రాత్రి పునరావృతమైంది. దాదాపు పావు గంట (15 నిమిషాలలు) పాటు ఆలయ శిఖరంపై డ్రోన్ చక్కర్లు కొట్టిన దృశ్యం దృష్టికి వచ్చింది. శ్రీ మందిరం ప్రాకారం లోపల ఆనంద్ బజార్, స్నాన మండపం ప్రాంగణాల మీదుగా డ్రోన్ సంచారం కలవరపరిచింది. డ్రోన్ ఎక్కడి నుంచి నియంత్రిస్తున్నారో స్పష్టం కాలేదు. ఇటీవల జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో సాధారణంగా వారాంతంలో నో–ఫ్లై జోన్‌లో తరచుగా డ్రోన్‌లు, విమానాల సంచారం తారసపడుతోంది.