
రమేశ్ హాల్బాకు ఘనంగా నివాళి
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లాకు చెందిన వీర జవాన్ రమేశ్ హాల్బా స్మృతి దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు . జిల్లాకు చెందిన రమేశ్ హాల్బా 2007లో సీఆర్‌పీఎఫ్‌లో సిపాయిగా చేరి 2009లో జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉగ్రవాదుల కాల్పుల్లో 29/9/2009 లో వీర మరణం పొందారు. 16వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఉన్నత పాఠశాలలోని ఆయన విగ్రహం వద్ద సోమవారం స్మృతి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరంగ్‌పూర్ 12 వ బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ కమాండర్ రాజీవ్ కుమార్ వచ్చి పూలమాలలు వేసి నివాళులర్పించారు.