
మాజీ ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠికి ఘనంగా నివాళి
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠి 46వ వర్ధంతి మంగళవారం నిర్వహించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులో సదాశివ త్రిపాఠి పార్క్‌లో సదాశివ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్మృతి సభ నిర్వహించారు. సమావేశంలో నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ప్రసంగిస్తూ రాష్ట్రంలో భూ సంస్కరణలు సదాశివ త్రిపాఠి కఠినంగా అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాక ముందు రెవెన్యూ మంత్రిగా పని చేసినప్పడు తనకు చెందిన 700 ఎకరాలు భూమిని ప్రభుత్వ పరంచేసిన ఘనత సదాశివకి చెందుతుందన్నారు. అంతకు ముందు సదాశివ సమాధి వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ మహేశ్వర్ స్వయ్, చైర్మన్ కును నాయక్, ఏపీపీ సంతోష్ మిశ్ర, కేదార్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠికి ఘనంగా నివాళి