
బీజేడీకి నెక్కంటి గుడ్‌బై
రాయగడ: రాజ్యసభ మాజీ ఎంపీ, బీజేడీ సీనియర్ నాయకుడు నెక్కంటి భాస్కరరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేశారు. బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట ఇకపై తన సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్థానిక తేజస్వి హోటల్ సమీపంలోని మైదానంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బిజూ పట్నాయక్ 1974లో తనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారని, అనంతరం ఆయన తనయుడు నవీన్ పట్నాయిక్‌తోనూ పనిచేశానని తెలిపారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో అధిష్టానం తనను విస్మరించడం జీర్ణించుకోలేకపోతున్నానని, అందుకే పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నానని వివరించారు. జిల్లాలో ఎందరో తనను ఆదరిస్తున్నారని, వారి వెనుక నిలబడేందుకే బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట సామాజిక వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు. ఇది కేవలం సేవకు మాత్రమేనని, రాజకీయాలకు కాదని స్పష్టం చేశారు.
పెద్దల సలహాతో..
కొద్ది రోజులుగా రాష్ట్రంలో బీజేడీలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాను మరొకరికి ఇవ్వడం నెక్కంటికి నచ్చలేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, తన మద్దతుదారుల్లో అసంతృప్తి పెరగడం కూడా ఈ వేదిక ఏర్పాటుకు మరో కారణమని అన్నారు. రాష్ట్ర స్థాయి పెద్దలతో, తన సహచరుల సలహాతో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన బిజూ స్వాభిమాన్ మంచ్ వేదికకు అందరి సహకారం అవసరమని తెలిపారు. అనంతరం మంచ్ లోగోను ఆవిష్కరించారు.
ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలోనే..
జిల్లాలో ఎందరో తనను ఆదరించారని నెక్కంటి తెలిపారు. పార్టీలో అనేక హోదాల్లో కొనసాగిన తాను జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో పనిచేశానని పేర్కొన్నారు. తనను పార్టీ అవమానించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తన రక్తాన్ని పంచుకుపుట్టిన ఇద్దరు అన్నదమ్ములను ఒక సందర్భంలో కోల్పొయినప్పటికీ బీజేడీ ఆశయ సాధన కొసం, జిల్లా అభివృద్ధి కోసం పనిచేసినట్లు గుర్తు చేశారు.
ఎవరినీ నిందించడం లేదు
తాను ఏర్పాటు చేసిన బిజూ స్వాభిమాన్ మంచ్ కేవలం ప్రజా సంక్షేమం కోసమేనని నొక్కి చెప్పారు. అయితే అందుకు ఎవ్వరిని నిందించడం లేదని స్పష్టం చేశారు. త్వరలో మంచ్ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. బీజేడీకి నెక్కంటి మద్దతు దారులు, అనుయాయులు, కార్యకర్తలు సామాహికంగా రాజీనామాలు చేశారు. అందరి సమక్షంలో ఈ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు గంగాధర్ పువ్వల, బీజేడీ యువ నాయకులు బినాయక్ కర్, అమయ స్వాయి, అవినాష్ బిశొయి, తదితర పార్టీ ప్రముఖులు బీజేడీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేశారు.
బిజూ స్వాభిమాన్ మంచ్ పేరిట కార్యకలాపాలు

బీజేడీకి నెక్కంటి గుడ్‌బై

బీజేడీకి నెక్కంటి గుడ్‌బై

బీజేడీకి నెక్కంటి గుడ్‌బై