
కాటేసిన అంధ విశ్వాసం
● పాముకాటు వైద్యం అందక
అక్కా తమ్ముడు మృతి
కొరాపుట్: బరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి రాజ్‌పూర్ గ్రామంలో మంగళవారం వేకువజామున ఇంటిలో నిద్రపోతున్న అమిత హరిజన్ (11), ఆమె తమ్ముడు పూజరాజ్ హరిజన్ (9 నెలలు)ను పాము కాటేసింది. దీంతో ఇద్దరు పిల్లలు ఏడవడంతో మేలుకున్న కుటుంబ సభ్యులు పామును గుర్తించి చంపేశారు. కానీ పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా మంత్రగత్తె వద్ద పూజలు చేయించారు. కానీ అప్పటికే బాలలు ఇద్దరూ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఇది గమనించిన గ్రామ యువకులు వెంటనే అంబులెన్స్‌ను రప్పించి బాలలను ఉమ్మర్ కోట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పాము కాటు జరిగిన వెంటనే ఆస్పత్రికి తెచ్చి ఉంటే బాలలిద్దరూ బతికేవారని వైద్యులు పేర్కొన్నారు.

కాటేసిన అంధ విశ్వాసం

కాటేసిన అంధ విశ్వాసం

కాటేసిన అంధ విశ్వాసం

కాటేసిన అంధ విశ్వాసం