
గజపతి జిల్లాలో అధికారుల పర్యటన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో జిల్లా నోడల్ సెక్రటరీ, భువనేశ్వర్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (బీడీఏ) ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.తిరుమల రెండు రోజుల పర్యటనలో ఆర్.ఉదయగిరి ఇండోర్ స్టేడియంలో అంత్యోదయ పథకం గృహాలు లబ్ధిదారులకు తాళాలు అందజేశారు. అనంతరం నువాగడ బ్లాక్‌లో ఖోజురిపద బ్లాక్ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి అక్కడ రోగులకు ఉత్తమ చికిత్స అందజేయాలని డాక్టర్లు, సిబ్బందిని ఆదేశించారు. రాయఘడ బ్లాక్‌లో జయ్‌మా మిషన్ శక్తి కుట్టుమిషన్ల కేంద్రాన్ని సందర్శించి అక్కడ మహిళా స్వయం సహాయక గ్రూపులతో మాట్లాడారు. తర్వాత రాయఘడ బ్లాక్‌లో డంబాపూర్ వద్ద అంగన్‌వాడీ కేంద్ర నిర్మాణ పనులను సందర్శించి, సుభధ్ర పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. నోడల్ సెక్రటరీ వెంట జిల్లా కలెక్టర్ మధుమిత, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఆదనపు కార్యనిర్వాహణ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాల్మన్ రైకా, ఒడిశా జీవనోపాదుల పీడీ టిమోన్ బోరా, ఆర్.ఉదయగిరి, నువాగడ, రాయగడ బీడీఓ ఉన్నారు.