
ఎమ్మెల్యే దృష్టికి తడమ పంచాయతీ సమస్యలు
రాయగడ: రాయగడ శాసన సభ నియోజకవర్గం పరిధిలోని తడమ పంచాయతీలో నెలకున్న సమస్యలను ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక విన్నారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్యటించారు. ప్రజల ఆరోగ్య భద్రతకు గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో సరిగ్గా వైద్యులు ఉండటం లేదని మహిళలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వైద్యులు సకాలంలో వైద్య సేవలు పొందలేకపొతున్నామని ఎంఎల్‌ఏకు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. దీంతో అత్యవసర పరిస్థితిలో చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రిపై ఆధారపడాల్సి వస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన ఎంఎల్‌ఏ ఈ సమస్య వైద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పంచాయతీలోని వివిధ గ్రామాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకున్నారు.
నిందితులను కఠినంగా
శిక్షించాలి
ఇచ్ఛాపురం : విశాఖపట్నం సీతమ్మధారలో మూగబాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్–1 ఉలాల భారతి దివ్య డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నేరస్తులను వెంటనే పట్టుకుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు.