
విద్యుత్ పొరుగు సేవల ఉద్యోగుల నిరసన
పర్లాకిమిడి: విద్యుత్ ఉద్యోగుల నాలుగు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అఖిల భారత ఒడిషా విద్యుత్ మజ్దూర్ మహాసంఘ్ పేరిట మంగళవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిపారు. తొలుత మెడికల్ జంక్షన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన విద్యుత్ ఉద్యోగుల మహాసంఘం కలెక్టరేట్‌కు చేరుకుని నినాదాలు చేశారు. టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్లు, హెల్పర్లు, కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గ్రేడ్‌పే పెంచాలని, ఎన్‌పీసీ, యూపీఏకు బదులు పాతపింఛను విధానం అమలుచేయాలని, హరియాణా రాష్ట్ర అవుట్ సోర్సింగ్ మోడల్ అమలు, ఇంటర్ జోన్ బదిలీలు, ఒడిశాలో కేంద్ర పీఆర్‌సీ 2019 అమలు వంటి పలు డిమాండ్లతో ఆందోళన జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి మోహన్ మఝి, ఉపముఖ్యమంత్రి కనకవర్ధన్ సింగ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పేరిట అడ్రస్ చేసిన వినతి పత్రాన్ని అదనపు మేజిస్ట్రేట్ ఫాల్గుణీ మఝికి తన కార్యాలయంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, విద్యుత్ మజ్దూర్ మహాసంఘ్ కార్యదర్శి సత్యబ్రత పరిడాలు కలిసి అందజేశారు. ఆందోళనలో కోశాధికారి మున్నాదామి, జిల్లాలోని పలు సబ్ డివిజన్‌లలో పనిచేస్తున్న విద్యుత్ లైన్‌మెన్లు, పోరుగుసేవల ఉద్యోగులు పాల్గొన్నారు.

విద్యుత్ పొరుగు సేవల ఉద్యోగుల నిరసన