
చట్టాలపై అవగాహన అవసరం
జయపురం: విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరమని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం అధ్యక్షులు ప్రదీప్ కుమార్ మహంతి అన్నారు. స్థానిక మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సచేతన ప్రదీకరణ జిల్లా కార్యదర్శి ప్రద్యోమయ సుజాత మాట్లాడుతూ.. మహిళలపై దాడులను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. యాసిడ్ దాడి బాధితులకు ఉచిత వైద్యం, రూ.3 లక్షల నష్ట పరిహారంతో పాటు కేసు దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వీసీఎస్ ఏర్పాటు చేశాయని వివరించారు. శిబిరంలో విజిలెన్స్ కోర్టు స్పెషల్ పీపీ డాక్టర్ బి.గాయత్రీదేవి, కొరాపుట్ జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి డాక్టర్ సుసంధ్య దేవదర్శిణి, మున్సిపల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రియదర్శిణి పొరిడ తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం