
ఉపాధ్యాయులే నిర్దేశకులు టీచర్స్‌డే ఘనంగా జరిగింది. ఉపాధ
వామన స్వరూపంలో
శ్రీ జగన్నాథుడు
భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో శుక్రవారం బలి వామన అలంకరణలో శ్రీ జగన్నాథుడు శోభిల్లాడు. శ్రీ బలభద్ర స్వామి రాజ ఠీవి అలంకరణతో, దేవీ సుభద్ర సాధారణ వస్త్రధారణలో రత్న వేదికపై కొలువు దీరారు. భాద్రపద మాసం శుక్ల పక్ష ద్వాదశి తిథి పురస్కరించుకుని శ్రీ మందిరంలో మధ్యాహ్న ధూపం నిర్వహించిన తర్వాత, శ్రీ జగన్నాథ మహా ప్రభువుని బంగారు ఆభరణాలతో వామన స్వరూపంలో అలంకరించారు. బొడొ సింగారొ పూజ వరకు ఈ అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది.
హిరాకుద్ వరద నీరు విడుదల
భువనేశ్వర్: హిరాకుద్ జలాశయం నీటి మట్టం 626.62 అడుగులు. జలాశయంలో 24 గేట్లు తెరిచి వరద నీరు విడుదల చేస్తున్నారు. హిరాకుద్ జలాశయంలోకి 4 లక్షల 23 వేల 936 క్యూసెక్కుల నీరు ప్రవేశిస్తోంది. 2,94,235 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఉపాధ్యాయులే నిర్దేశకులు టీచర్స్‌డే ఘనంగా జరిగింది. ఉపాధ