
ఆటో బోల్తా.. విద్యార్థులకు గాయాలు
రాయగడ: పాఠశాల నుంచి ఇంటికి ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. గుణుపూర్‌లో ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న పది మంది విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి ఒక ఆటోలో తిరిగి వస్తున్న సమయంలో విక్రమపూర్ సమీపంలోని మలుపులో ఆటో బోల్తా పడింది. దీంతో ఇందులో ఉన్న విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను గుణుపూర్ సబ్ డివిజన్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇందులో ఇద్దరి పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో వారిని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తరలించినట్లు సమాచారం. ఆటో డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.