
గజపతి జిల్లాలో రఘువీరా రెడ్డి పర్యటన
పర్లాకిమిడి: రాష్ట్రంలో వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెస్తామని మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి అన్నారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో 2029 లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిని చేయడం తమ లక్ష్యం అని రఘువీరా రెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. ఆయన పర్లాకిమిడిలో శుక్రవారం పర్యటించారు. ఆయనకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మోహన ఎమ్మెల్యే దాశరథి గోమాంగో ఘన స్వాగతం పలికారు. ఎన్.రఘువీరా రెడ్డి జంగం వీధి వద్ద ఆర్.ఆర్ కల్యాణ మండపంలో తొలుత ప్రెస్‌మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ శ్రీజాన్ అభియాన్ కార్యక్రమం గజపతి జిల్లాలో రెండు నియోజకవర్గాలు, ఏడు సమితి కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు జరిపి పార్టీ పటిష్టతకు ప్రతి కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్‌లు, బూత్ లెవల్‌లో సభ్యుల్ని కలుస్తానన్నారు. పర్లాకిమిడి నియోజకవర్గంలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, ఆరు సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందిందని, అలాగే మోహన నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు దాశరథి గోమాంగో శాసనసభ్యులుగా కొనసాగుతున్నారన పేర్కొన్నారు. గత లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు కోద్ది సీట్ల తేడాతో అధికారం కోల్పోయిందని తెలిపారు. గజపతి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, సోషల్ మీడియాను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకుంటామని అన్నారు. జిల్లాలో గుమ్మా, గుసాని, కాశీనగర్, రాయఘడ, ఆర్.ఉదయగిరి, మోహనాలలో ఏడు రోజుల పాటు పర్యటించి తుది నివేదిక ఏ.ఐ.సి.సి.అధ్యక్షుడు ఖర్గేకు పంపిస్తానని రఘువీరా రెడ్డి అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, పి.సి.సి ప్రతినిధి కృష్ణచంద్ర పతి, పూరీ జిల్లా మహిళా కాంగ్రెస్ ఆబ్జర్వర్ నిరుపమా పాత్రో, శంకర్‌సం ఖుటియా తదితరులు పాల్గొన్నారు.

గజపతి జిల్లాలో రఘువీరా రెడ్డి పర్యటన

గజపతి జిల్లాలో రఘువీరా రెడ్డి పర్యటన

గజపతి జిల్లాలో రఘువీరా రెడ్డి పర్యటన