
ఐఎఫ్‌ఎస్ అధికారుల సమావేశం
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
గవర్నర్, సీఎంతో ..
భువనేశ్వర్: 2000, 2001 బ్యాచ్‌లకు చెందిన భారతీయ విదేశీ సేవలు (ఐఎఫ్‌ఎస్) అధికారుల బృందం సోమవారం రాజ్ భవన్‌లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి, లోక్ సేవా భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిశారు. ఈ సందర్భంగా స్థానిక కళింగ స్టేడియంను సందర్శించారు. ఈ ఐఎఫ్‌ఎస్ అధికారుల బృందంలో రొమేనియాకు భారత రాయబారి డాక్టర్ మనోజ్ కుమార్ మహాపాత్రో, రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియాకు భారత రాయబారి అమిత్ నారంగ్, రిపబ్లిక్ ఆఫ్ మాల్టాకు భారత హైకమిషనర్ గ్లోరియా గ్యాంగ్టే ఉన్నారు. సమావేశంలో, అధికారులు ముఖ్యమంత్రితో రాష్ట్రంలో పాలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రపంచవ్యాప్తంగా భారత దేశం దౌత్యపరమైన సంబంధాల పటిష్టత దిశలో కార్యాచరణ తదితర అంశాలపై అధికారుల బృందం ముఖ్యమంత్రితో సంభాషించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. విదేశాలలో భారత దేశ ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించడంలో కీలక పాత్రధారులుగా న్యాయం చేసే దిశలో నిరంతరం కృషి చేయాలని అధికారుల్ని ప్రోత్సహించారు. ఈ ఏడాది రాష్ట్రంలో ప్రవాసీ భారతీయ దివస్‌ను విజయవంతంగా నిర్వహించడంపై అధికారులు ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచ భారతీయులు, ముఖ్యంగా ఒడియాలు రాష్ట్రంతో మరింత అనుసంధానం కావడానికి ప్రోత్సహించిందని కొనియాడారు. యూరప్ దేశాల్లో నైపుణ్యం కలిగిన యువతకు పెరుగుతున్న డిమాండ్‌ను రాయబారులు వివరించారు. రాష్ట్ర యువతకు తగినంత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకునివెళ్లారు. నైపుణ్య కార్యక్రమాల ద్వారా ఒడిశా తన యువతను సన్నద్ధం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుకై న చర్యలు చేపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. స్కిల్డ్ ఇన్ ఒడిశా చొరవ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా మారింది. రాష్ట్ర యువతకు ఉజ్వల భవిష్యత్ ప్రసాదిస్తుందన్నారు. యూరోప్ దేశాలలో ఒడిశా సాంస్కృతిక వారసత్వం మరియు హస్తకళలను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రానికి ప్రపంచ శ్రేణి గుర్తింపు లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృందం అధికారులు కళింగ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా విభాగం కార్యదర్శి, డైరెక్టర్ ఇతర సీనియర్ అధికారులతో సంభాషించారు. ఒడిశా సమగ్ర పర్యావరణ వ్యవస్థ, అట్టడుగు అభివృద్ధిపై అధికారుల బృందం దృష్టి సారించింది. ఒడిశా క్రీడా నైపుణ్యం ప్రపంచ గుర్తింపును సాధించిందని అధికారులు ప్రశంసించారు.

ఐఎఫ్‌ఎస్ అధికారుల సమావేశం

ఐఎఫ్‌ఎస్ అధికారుల సమావేశం

ఐఎఫ్‌ఎస్ అధికారుల సమావేశం

ఐఎఫ్‌ఎస్ అధికారుల సమావేశం