
బొరిగుమ్మలో హర్షాతిరేకాలు
కొరాపుట్: రాష్ట్ర స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి మొహన్ చరణ్ మాఝి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత గుర్తించిన మున్సిపాలిటీలు, ఎన్‌ఏసీల జాబితా ప్రకటించారు. అందులో బొరిగుమ్మ పంచాయతీ కేంద్రానికి ఎన్‌ఏసీ హోదా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అధికార బీజేపీకి చెందిన గౌతం శాంత్ర నేతృత్వంలో కార్యకర్తలు బొరిగుమ్మ మెయిన్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య జంక్షన్‌లో ప్రజలకు మిఠాయి పంచి పెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతి మీడియాతో మాట్లాడుతూ ఇది బొరిగుమ్మ ప్రజల పోరాట ఫలితమన్నారు. బీజేడీకి చెందిన మాజీ మంత్రి రబి నారాయణ నందో మాట్లాడుతూ గతం లోనే మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నయక్ బొరిగుమ్మ ని ఎన్‌ఏసీగాగా ప్రకటించిన విషయం గుర్తు చేసారు.

బొరిగుమ్మలో హర్షాతిరేకాలు