
ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం
● అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో స్వపరిపాలన దినోత్సవాన్ని రెండు రోజులుగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పథోత్సవాల పేరిట నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. మెయిన్ రోడ్డు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాలు, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలతో పాటు చిన్నారులతో కరాటే విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఆదివారం జరగనున్న స్వపరిపాలన దితోత్సవ వేదికలను కొత్త బస్టాండు వద్ద ఘనంగా జరుపుకునేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మమత గౌడో, వైస్ చైర్మన్ శివకుమార్ గౌడవ, సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్ పాల్గొన్నారు.

ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం

ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం

ఉత్సాహంగా స్వపరిపాలన దినోత్సవం