
మారుమూల ప్రాంతాల్లో అధికారి పర్యటన
రాయగడ: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండొ జిల్లాలోని మునిగుడ సమితి మునిఖాల్ పంచాయతీలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించారు. పంచాయతీ పరిధిలో గల బొడొడెంగుని, శకట తదితర గ్రామాల్లో పర్యటించారు. సరైన రహదారులు లేని ఈ గ్రామాల్లో ఆయన కొంత దూరం కాలినడకన మరికొంత దూరం బైక్‌పై ప్రయాణించి ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఈ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఎంతమందికి ఇళ్లు మంజూరయ్యాయి. వాటిని ఎంతమంది లబ్ధిదారులు పొందారు అన్న వివరాలను ఆయన సంబంధిత శాఖ అధికారులను తన వెంట తీసుకుని వెళ్లి వివరాలను సేకరించారు. అంతకు ముందు మునిఖొల్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, సమితి సభ్యులు, పంచాయతీ అధికారి తదితరులతో సమవేశమై పంచాయితీలొ జరగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షించారు.

మారుమూల ప్రాంతాల్లో అధికారి పర్యటన

మారుమూల ప్రాంతాల్లో అధికారి పర్యటన