
నిందితులను అరెస్టు చేయాలి
రాయగడ: స్థానిక మహిళా కళాశాల వెనుక నివసిస్తున్న రొహిత్ థప్ప హత్య కేసుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బా ధిత కుటుంబీకులు, బస్తీ వాసులు గురువారం ఆందోళన చేపట్టారు. సదరు పోలీస్ స్టేషన్‌ను ఘెరావ్ చేయడంతోపాటు ఫ్లై ఓవర్ వద్ద రాస్తారోకో చేశారు. బుధవారం రోహిత్ థప్ప అనే యువకుడిని కొందరు దుండగులు అగ్నిమాపక కేంద్ర కార్యాలయం వద్ద గల మైదానంలో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యకు కారకులైన వారిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆరోపించారు. రస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలు సుమారు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. పోలీసులు చోరవ తీసుకుని నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళనను విరమించారు.

నిందితులను అరెస్టు చేయాలి