
విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
డెంకాడ: విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని, కొత్త ఆవిష్కరణల వైపు అడగులు వేయాలని లెండి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి ఆకాంక్షించారు. మండలంలోని జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో హ్యాకథాన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లెండి కళాశాల ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెల్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ–2005 సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నేర్పే ప్రతి అంశం క్షుణ్నంగా నేర్చుకుని, భవిష్యత్‌లో అభివృద్ధి చెందేందుకు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.