
నబరంగ్‌పూర్ జిల్లాకు చేరుకున్న పీసీసీ చీఫ్
కొరాపుట్: రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత భక్త చరణ్ దాస్ తొలిసారిగా నబరంగ్‌పూర్ జిల్లాకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని సర్క్యూట్ హౌస్ వద్దకు వచిన ఆయనకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగింది. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ లలూ, నాయకులు భుజబల్ మజ్జి, డాక్టర్ లిఫికా మజ్జి, దిలిప్ బెహరా తదితరులు పాల్గొన్నారు.
మజ్జిగ వితరణ
రాయగడ: స్థానిక మార్వడీ యువమంచ్ ఆధ్వర్యంలో స్థానిక రాణి కాంప్లెక్స్ వద్ద శనివారం మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఎండతో ఇబ్బంది పడుతున్న బాటసారులకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని యువమంచ్ అధ్యక్షులు కమల్ జైన్, కార్యదర్శి ఉజ్వల్ జైన్‌లు తెలియజేశారు. సుమారు వెయ్యిమంది బాటసారులకు మజ్జిగ వితరణ చేసినట్లు వివరించారు. ప్రతీ ఏడాది వేసవిలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాన్నారు.
జయపూర్‌లో గ్యాంగ్ వార్
కొరాపుట్: జయపూర్‌లో గ్యాంగ్ వార్ జరగగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నబరంగ్‌పూర్‌కి చెందిన కొందరు యువకులు జయపూర్ సమీపంలోని బ్రహ్మణి గాంలో వివాహానికి వెళ్లారు. అక్కడ కొందరి మధ్య మనస్ఫర్థలు రేగాయి. అనంతరం జయపూర్‌లో నువావీధి లో రెండు గ్రూపులు ఎదురెదురు కావడంతో కొట్లాటకు దిగారు. ఘటనలో బ్రహ్మణి గాంకి చెందిన అర్జున్ హరిజన్, నబరంగ్‌పూర్‌కి చెందిన సాగర్ నాయక్, అజిత్ నాయక్, సాగర్ హరిజన్‌లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను జయపూర్‌లోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సాగర్ నాయక్, అర్జున్ హరిజన్ లను కొరాపుట్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ సాహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాలకి తరలించారు.
వ్యాన్ బోల్తా : 8 మేకలు మృతి
రాయగడ: సదరు సమితి జిమిడిపేట సమీపంలోని మలుపులో పికప్ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఎనిమిది మేకలు మృతి చెందాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయిపూర్ నుంచి 30 మేకల లోడుతో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైపు వెళుతున్న వ్యాన్ జిమిడిపేట వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలు తగిలాయి. సమాచారం తెలుసుకున్న శెశిఖాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బోల్తా పడిన వ్యాన్‌ను జేసీబీతో రోడ్డు పక్కకు నెట్టించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నబరంగ్‌పూర్ జిల్లాకు చేరుకున్న పీసీసీ చీఫ్

నబరంగ్‌పూర్ జిల్లాకు చేరుకున్న పీసీసీ చీఫ్