
వన్యప్రాణులను సంరక్షించాలి
మల్కన్‌గిరి: వన్యప్రాణులను సంరక్షించాలని వక్తలు అన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో వరల్డ్ టర్టిల్ డేను పురస్కరించుకొని శనివారం సదస్సు నిర్వహించారు. తాబేళ్ల అక్రమ రవాణా, విక్రయాల విషయంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంపై చర్చించారు. వర్క్‌షాప్‌కు వన్యప్రాణులు, హెర్పటాలజీ నిపుణులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అటవీశాఖ అధికారి ప్రతాప్ కొత్తపల్లి తాబేళ్ల సురక్షతపై చర్చించారు. అక్రమ రవాణా జరుగుతున్న తాబేళ్లలను రక్షించి తిరిగి వాటిని నీటిలో విడిచిపెట్టే విధంగా అటవీ సిబ్బంది కృషి చేయాలన్నారు.