
వేటగాళ్ల కాల్పుల్లో ఫారెస్ట్ గార్డు మృతి
భువనేశ్వర్: ఢెంకనాల్ జిల్లా అటవీ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న సమయంలో ఫారెస్ట్ గార్డు వేటగాళ్ల తుపాకీ గుళ్లకు బలయ్యాడు. 37 ఏళ్ల ప్రహ్లాద్ ప్రధాన్ కాల్పుల్లో చనిపోయాడు. అక్రమ వేట కార్యకలాపాలను అరికట్టే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో వేటగాళ్ల మూక ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు.
ఢెంకనాల్ జిల్లా హిందోల్ అటవీ ప్రాంతంలో 13 మంది అటవీ సిబ్బందితో కూడిన బృందం యథాతథంగా సాధారణ గస్తీలో ఉండగా వేటగాళ్లు పేలుళ్లకు పాల్పడ్డారు. రాజ్‌మోహన్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తుపాకీ తూటా ప్రహ్లాద్ ప్రధాన్ పొట్టలోకి దూసుకుపోయి తీవ్రంగా గాయపరిచింది. తక్షణమే అంగుల్ జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది ఆయన మరణించినట్లు ప్రకటించారు. దాడి జరిగిన వెంటనే విధి నిర్వహణలో ఉన్న తోటి సిబ్బంది సమయ స్ఫూర్తితో కాల్పులకు పాల్పడిన వేటగాళ్ల బృందం వైపు దృష్టి సారించింది. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిలో భాగమని భావించిన నలుగురు వ్యక్తులను పెట్రోలింగ్ బృందం అదుపులోకి తీసుకుంది. దాడిలో పాల్గొన్న అనేక మంది సంఘటన స్థలం నుంచి తప్పించుకోగలిగారు. అదుపులోకి తీసుకున్న వేటగాళ్ల వద్ద దొరికిన తుపాకీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన మిగిలిన వారి వివరాలు తదితర అనుబంధ సమాచారం కోసం ఆరా తీస్తున్నారు.
వేటగాళ్ల కాల్పులతో సిబ్బంది మృతి
అక్రమ వేట కార్యకలాపాలను అరికట్టే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై వేటగాళ్ల ముఠా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ప్రహ్లాద్ ప్రధాన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హిందోల్ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఉన్నత చికిత్స కోసం అక్కడి నుంచి అంగుల్ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్ గాయాలతో అతను మరణించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నలుగురు వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నామని ఢెంకనాల్ మండల అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) సుమిత్ కుమార్ కొరొ తెలిపారు.
రూ. 30 లక్షల పరిహారం
ఢెంకనాల్ జిల్లా హిందోల్ రేంజ్‌లోని రాజ్‌మోహన్‌పూర్ అడవిలో గస్తీలో ఉన్న ఫారెస్ట్ గార్డ్ ప్రహ్లాద్ ప్రధాన్ ప్రాణాలు కోల్పోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రూ. 30 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. పీసీసీఎఫ్ ప్రత్యక్షంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి తదుపరి దర్యాప్తు పటిష్టంగా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రూ. 30 లక్షల పరిహారం