
నరహరికి ఘన సత్కారం
పర్లాకిమిడి: పాతపట్నం మండలం కొరసవాడకు చెందిన పల్ల నరహరికి శ్రీకాకుళం జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడిగా నామినేటెడ్ పదవి దక్కినందుకు ఒడిశాలోని గజపతి జిల్లా కృష్ణ గొల్ల కుల సంఘం ఆధ్వర్యంలో పర్లాకిమిడిలో నగరం పల్లి వీధిలో ఆదివారం ఘనంగా సత్కరించారు. నరహరికి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు ఆయన స్ఫూర్తి తో గజపతి జిల్లాలో గొల్ల కుల సంఘం కూడా అభివృద్ధికి బాటలు వేస్తామని జిల్లా గొల్ల కుల సంఘం అధ్యక్షుడు ఎ.కులవర్దనరావు అన్నారు. ఈ సన్మాన సభలో కార్యదర్శి డి.అప్పన్న, బి.తిరుపతిరావు, ఎ.శ్రీనివాసరావు, బి.సంజీవి, బుడ్డు పాల్గొన్నారు.