
కుప్పకూలిన ఖుర్దా–బొలంగీరు సొరంగం
భువనేశ్వర్: బౌధ్ జిల్లా ఒడెణిగొడొ టీ–4 సొరంగం కుప్పకూలింది. నిర్మాణ దశలో ఇది కుప్పకూలి పోవడం చర్చనీయాంశమైంది. దీనిలో చిక్కుకున్న కార్మికులు, మృతులు తదితర సమాచారం అందు బాటులో లేదు. బౌధ్ జిల్లాలో ఖుర్దా రోడ్ – బొలంగీర్ రైల్వే ప్రాజెక్ట్‌లోని టీ–4 మలుపు అతి పొడవైన సొరంగం. ఇది ప్రాజెక్ట్‌లోని అతి పొడవైన సొరంగం మాత్రమే కాకుండా ఒడిశాలోని అతి పొడవైన రైల్వే సొరంగం కూడా. ఒడెణిగొడొ–చారిఛొకొ సొరంగంగా సుపరిచితం. ఇది 4,185 మీటర్లు విస్తరించి ఉంది. దీనిలో 30 మీటర్ల పొడవునా సొరంగం కుప్పకూలినట్లు సమాచారం.
పనులకు అంతరాయం
కొంతమంది మాజీ సీనియర్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, టీ–4 సొరంగం కూలిపోవ డం వల్ల 75 కిలోమీటర్ల పొడవైన దసపల్లా – పురు ణకటక్ మార్గం నిర్మాణ పనులు పూర్తి కావడం ప్రభావితం అవుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభించిన 226 కిలో మీటర్ల అనుసంధానం ప్రశ్నార్థకం అవుతుంది. అంచనా ప్రకారం ఈ ప్రాజె క్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇంతలో కీలక అనుసంధాన సొరంగం కుప్పకూలిపోవడం సమస్యాత్మకం అయ్యే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటన సొరంగం నిర్మాణంలో అనుబంధ వర్గాల నైపుణ్య దక్షత పెను సవాళ్లను ఎదుర్కొంటోంది.

కుప్పకూలిన ఖుర్దా–బొలంగీరు సొరంగం