
ఫుట్‌బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
మల్కన్‌గిరి: ఈ నెల 28 నుంచి జూన్ 3వ తేదీ వరుకు బరంపురంలో జరగనున్న జోనల్ స్థాయి అండర్ 15 ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ పోటీలకు మల్కన్‌గిరి క్రీడాకారులు ఎంపికయ్యారు. మల్కన్ గిరి జిల్లాలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి నిర్వహించిన అండర్ 15 ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ట్రోఫీలో విజేతలను ఎంపిక చేశారు. 24 మంది క్రీడాకారులను సోమవారం జిల్లా అథ్లెటిక్స్ సభ్యులు బరంపురం తీసుకెళ్లారు. జిల్లాకు కిర్తిప్రతిష్టలు తేవాలని అథ్లెటిక్ సంఘం కార్యదర్శి రామహరి పండా, జిల్లా క్రీడా కాంప్లెక్స్ వద్ద జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రదాన్ క్రీడాకారులను ప్రోత్సహించారు. ప్రసాదరావు, సహాయ కర్యదర్శి గోపీకృష్ణ పట్నాయక్, తదితరులు పాల్గొన్నారు.