బాధిత కుటుంబాలకు చేయూత
భువనేశ్వర్: విధి నిర్వహణలో అకాల మరణం పాలైన ఇద్దరు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ముఖ్యమంత్రి చేయూతనిచ్చి ఆదుకున్నారు. దివంగత సిబ్బంది భార్యలకు హోం గార్డు ఉద్యోగం కల్పించారు. స్థానిక లోక్‌సేవా భవన్‌లో బుధవారం ముఖ్యమంత్రి నియామక పత్రం మరియు సహాయనిధి కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రభాసిని బెహరా, దేవి షబర్ నియామకపత్రంతో పాటు చెక్కులు అందుకున్నారు. వీరి ఇద్దరు భర్తలు పీసీఆర్ వ్యాన్‌లో డ్యూటీలో ఉండగా ప్రమాదంలో ఇటీవల మరణించారు.
మహిళలకు చెక్కులు, నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం మోహన్‌చరణ్
బాధిత కుటుంబాలకు చేయూత


