వ్యభిచారం గుట్టురట్టు | - | Sakshi
Sakshi News home page

వ్యభిచారం గుట్టురట్టు

Published Sun, Mar 23 2025 9:21 AM | Last Updated on Sun, Mar 23 2025 9:17 AM

జయపురం: స్థానిక మెయిన్‌ రోడ్డులోని ఒక హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పట్టణ పోలీసులు దాడిచేసి ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేశాడు. వారిలో లాడ్జి మేనేజర్‌ సైతం ఉన్నట్లు పోలీసు అధికారి ఈశ్వర తండి తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 20వ తేదీన పెట్రోలింగ్‌ జరుపుతున్న సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఒక లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసు అధికారి ఈశ్వర తండి నేతృత్వంలో పోలీసులు హోటల్‌పై దాడి జరిపారు. లాడ్జి మేడమీద ఉన్నటువంటి రూమ్స్‌లో మహిళలు, విటులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. మహిళలను విచారించగా తమకు హోటల్‌ మేనేజర్‌ సహకరించినట్లు వెల్లడించారు.

జయపురంలో చోరీ

జయపురం: స్థానిక హటపొదర్‌ ప్రాంతంలోని ధానవీ టౌన్‌షిప్‌లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. ఆ టౌన్‌షిప్‌లోని నివసిస్తున్న బరుణ పండ ఇంట్లో జరిగిన దొంగతనంలో రూ.85 వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇంట్లో విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు ఇంటి యజమాని పండ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి ఈఽశ్వర తండి వెల్లడించారు. పండా తన ఫిర్యాదులో వారం రోజుల క్రితం ఇతర ప్రాంతానికి వెళ్లానని తెలిపాడు. ఇంటికి తాళాలు వేసి చూడమని తన మిత్రుడికి చెప్పానన్నారు. ప్రతిరోజూ ఇంట్లో పడుకోమని చెప్పి, ఫోన్‌చేసి కనుగునేవాడినన్నాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంట్లో దొంగతనం జరిగిందని తన మిత్రుడు తెలియజేయడంతో వెంటనే ఇంటికి వచ్చి చూశానని తెలిపాడు. అల్మరాలో ఉంచిన రూ.85 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి సామాన్లు చోరీకి గురయ్యాయని వాపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

చోరీ కేసులో నిందితులు అరెస్టు

రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి అంబొదల పోలీసులు శుక్రవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో ఒక మహిళ కూడా ఉంది. వారి నుంచి రూ.30 వేల నగదు, రెండు బంగారు చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. నిందితుల వివరాలు వెల్లడించ లేదు.

మహిళ దారుణ హత్య

మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి మొహిపోదర్‌ గ్రామంలో చేపల పంపిణీలో వివాదం తలెత్తడంతో లక్ష్మీ కళాడ్‌(35) అనే మహిళను అదే గ్రామానికి చెందిన ధనుంజయ కళాడ్‌ అనే వ్యక్తి హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వీరిద్దరూ కొన్ని నెలలుగా ఒక వ్యాపారి వద్ద నుంచి చేపలు తీసుకొచ్చి గ్రామంలోని చెరువులో పెంచుతున్నారు. అయితే ధనుంజయ ఒక్కడే చెరువులో చేపలను శుక్రవారం తీసి లక్ష్మీకి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె అతడిని నిలదీయగా గొడ్డలితో దాడితో చేశాడు. వెంటనే కుటుంబ సభ్యులు మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మర్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. దీంతో పోలీసుస్టేషన్‌లో లక్ష్మీ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు.

వ్యభిచారం గుట్టురట్టు 1
1/3

వ్యభిచారం గుట్టురట్టు

వ్యభిచారం గుట్టురట్టు 2
2/3

వ్యభిచారం గుట్టురట్టు

వ్యభిచారం గుట్టురట్టు 3
3/3

వ్యభిచారం గుట్టురట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement