భువనేశ్వర్:
ఒడిశా నుంచి కొత్తగా ఎన్నికై న ముగ్గురు రాజ్య సభ ఎంపీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో మన్మోహన్ సామల్, సంతృప్త్ మిశ్రా, దిలీప్ రే ఉన్నారు. రాజ్య సభ ఛైర్మన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. బిజూ జనతా దళ్ టికెట్‌పై ఎన్నికై న డాక్టర్ సంతృప్త్ మిశ్రా తొలిసారిగా రాజ్య సభకు ఎన్నికై సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మన్మోహన్ సామల్ రాజ్య సభకు ఎన్నిక కావడం ఇది రెండో పర్యాయం. ఆయన గతంలో 2000 నుండి 2004 వరకు ఎగువ సభలో ప్రాతినిథ్యం వహించారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికై న దిలీప్ రే 18 ఏళ్ల తర్వాత రాజ్య సభలోకి తిరిగి అడుగు పెట్టడం విశేషం. రాజ్య సభకు ఎన్నిక కావడం తనకు ఇది మూడో సారి. ఆయన గతంలో 1996 నుంచి 2002 వరకు, 2002 నుండి 2008 వరకు వరుసగా 2 పర్యాయాలు రాజ్య సభ సభ్యుడిగా పని చేశారు. ఒకసారి జనతా దళ్ టికెట్‌పై, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు.


