బలిమెల గ్రీవెన్స్‌లో 16 వినతులు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బలిమెల గ్రీవెన్స్‌లో 16 వినతులు స్వీకరణ

Apr 7 2026 8:25 AM | Updated on Apr 7 2026 8:25 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల టౌన్‌హాల్‌లో జిల్లా కలెక్టర్‌ ప్రధమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 16 వినతులు అధికారులకు అందాయి. వాటిలో పది వ్యక్తిగత సమస్యలు కాగా ఆరు గ్రామీణ సమస్యలకు వినతులకు చెందనవి ఉన్నాయి. ఫిర్యాదుల పరిశీలన అనంతరం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, భూమిపట్టాలు, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, సహాయంపై అధికారులు చర్చించారు. తాగునీరు, విద్యుత్‌ కనెక్షన్‌, రహదారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వినోద్‌ పటేల్‌, అటవీశాఖ అధికారి సాయికిరణ్‌, అభివృద్ధి శాఖ అధికారి దశరాధి సరాబు, జిల్లా సబ్‌ కలెక్టర్‌ దుర్యోధన్‌ బోయి, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధన్‌, బీడీవోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement