● రాయగడ జిల్లాకు చైర్మన్‌గా బిద్యాధర్ సబర్, వైస్ చైర్మన్‌గా మంజుల
రాయగడ,భువనేశ్వర్: రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 23 జిల్లాలకు స్వతంత్ర అభివృద్ధి మండలి (ఎస్‌డీసీ )చైర్మన్, వైస్‌చైర్మలను నియమిస్తూ రాష్ట్ర ప్రభు త్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా రాయగడ జిల్లా ఎస్‌డీసీ చైర్మన్‌గా బిద్యాధర్ సబర్, వైస్ చైర్మన్ గా మంజుల మినియాకలు నియమితులయ్యారు. జిల్లాలోని ఆదివాసీ, హరిజన ప్రాంతాల సమన్వయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడే ఎస్‌డీసీ సంస్థ గత బీజేడీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది. అయితే గత ఎన్నికల్లో బీజేడీ పార్టీ అధికారం కోల్పోవడం.. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎస్‌డీసీని రద్దు చేసింది. అనంతరం 19 నెలల సుధీర్ఘకాలం తరువాత మళ్లీ ఆ సంస్థను పునరుద్ధరించే చర్యల్లో భాగంగా ఎస్‌డీసీలకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో అనుగుల్ జిల్లాకు చైర్మన్‌గా బషిష్ట నాయక్, వైస్ చైర్మన్‌గా సురుమాణి ఛత్తర్, బలంగీర్ జిల్లాకు చైర్మన్‌గా బల్లవ్ దరువ, వైస్ చైర్మన్‌గా జయంతీ భొయ్, బాలేశ్వర్ జిల్లాకు చైర్మన్‌గా బిపిన్ మారండి, వైస్ చైర్మన్‌గా ఝరనా సింగ్, బరఘడ్‌కు చైర్మన్‌గా గొవర్ధర్ భొయ్, వైస్ చైర్మన్‌గా తిలొత్తమా బూయి, బౌధ్‌కు చైర్మన్‌గా దమరూధర్ కన్హర్, వైస్ చైర్మన్‌గా ఝరనా జాని, దేవఘడ్‌కు చైర్మన్‌గా ప్రశాంత కుమార్ బెహర, వైస్ చైర్మన్‌గా ప్రమీలా కిషన్, ఢెంకానల్ జిల్లాకు చైర్మన్‌గా నవురి సింగ్ వైస్ చైర్మన్‌గా సేబతి భొయ్, గజపతి జిల్లాకు నీలమాధవ్ పాత్రో, వైస్ చైర్మన్‌గా లలితా ప్రధాన్, జాజాపూర్‌కు చైర్మన్‌గా రాజేంద్ర కండులియా, వైస్ చైర్మన్‌గా సని జరిక, ఝార్సుగుడకు చైర్మన్‌గా సునీల్ నాయక్, వైస్ చైర్మన్‌గా సంజుక్త ఓరం, కలహండి జిల్లాకు చైర్మన్‌గా బిజయ్ కుమార్ దిసారి, వైస్ చైర్మన్‌గా రినా భొయ్, కంధమాల్ జిల్లాకు చైర్మన్‌గా మనగొవింద ప్రధాన్, వైస్ చైర్మన్‌గా కల్పనా కుమారి కన్హర్, కేంజర్ జిల్లాకు చైర్మన్‌గా మమిత నాయక్, వైస్ చైర్మన్‌గా మానస్ కుమార్ నాయక్, కొరాపుట్ జిల్లాకు చైర్మన్‌గా భగవాన్ ముదులి, వైస్ చైర్మన్‌గా సుశాంతి మాఝి, మల్కనగిరి జిల్లాకు చైర్మన్‌గా గంగాధర్ సొడి, వైస్ చైర్మన్‌గా సావిత్రీ పడియామి, మయూర్‌భంజ్ జిల్లాకు చైర్మన్‌గా డాక్టర్ బుధామ్ ముర్ము, వైస్ చైర్మన్‌గా కౌసల్యనాయక్, నవరంగపూర్ జిల్లాకు చైర్మన్‌గా బాసంతి మాఝి, వైస్ చైర్మన్‌గా లింగరాజ్ భత్ర, నయాఘడ్‌కు చైర్మన్‌గా త్రినాఽథ్, వైస్ చైర్మన్‌గా మల్లిక్, సమితి డెవురి, నువాపడకు చైర్మన్‌గా హోమి సింగ్ మాఝి, వైస్ చైర్మన్‌గా బెలమతి మాఝి, సంబల్‌పూర్‌కు చైర్మన్‌గా భాగీంద్ర కిషాన్, వైస్ చైర్మన్‌గా సుస్మా ముండ, సుందర్‌ఘడ్ జిల్లాకు చైర్మన్‌గా సంతోష్ కుమార్ అమిత్, వైస్ చైర్మన్‌గా గంగీ కింపోలు నియమితులయ్యారు.
బిద్యాధర్ సబర్ మంజుల మినియాక


