మల్కన్‌గిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌ను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మాడ్కమి శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తికి సీఎంఆర్‌ఎఫ్ విడుదల చేయాలని విన్నవించారు. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో డైలీ మార్కెట్ వద్ద టీ స్టాల్ నడుపుతున్న చిత్రసేన్ పాలే అనే వ్యక్తి హోలీ రోజున ప్రమాదవశాత్తు సత్తిగూడ జలాశయంలో పడిపోయాడు. దీంతో అక్కడే స్నానం చేస్తున్న కొంతమంది అతడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్ రిఫర్ చేశాడు. గాయపడిన వ్యక్తిని చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమిలు శనివారం పరామర్శించారు. అనంతరం మరికొన్ని రోజులు చికిత్స అవసరమని తెలియజేయడంతో సీఎంను కలిసి రిలీఫ్ ఫండ్ అందజేయాలని విన్నవించారు.