కొట్‌పాడ్ ఎమ్మెల్యేకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్రకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ఉదయ ఇండియా ఫౌండేషన్ సంస్థ రూపుభొత్ర అవార్డు ప్రకటించింది. రూపుభొత్ర జీవన శైలి, రాజనైతిక కార్యకలాపాలు, కొట్‌పాడ్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులను పరిగణలోనికి తీసుకొని ఎమ్మెల్యే రూపు భొత్రను ఉదయ ఇండియా ఫౌండేషన్ ఉత్తమ పార్లమెంటీరియన్‌గా సన్మానించింది. కొరాపుట్ జిల్లాలో కొట్‌పాడ్ నియోజకవర్గంలో ప్రజలకు చేరువై సేవలు అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల మౌలిక సౌకర్యాలను తెలుసుకుంటూ వాటిని విధాన సభలో ప్రస్తావిస్తున్నారని, తన నియోజకవర్గంలో మారుమూల బహుళ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ ప్రజల ఆర్థిక ఉన్నతికి, వారి స్వయం ఉపాధికి కృషి చేస్తున్నారు. ఉదయ ఇండియా ఫౌండేషన్ వారు నిర్వహించిన కన్వెన్సన్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వాచస్పతి సురమ పాడీ, ఉపముఖ్యమంత్రి కనక వర్ధనసింగ్ దేవ్, ఉదయా ఇండియ ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ దీపక్ కుమార్ రథ్‌లు ఎమ్మెల్యే రూపు భొత్రకు అవార్డుతో సన్మానించారు.


