మావోయిస్టు బ్యానర్ కలకలం
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితి తెలంగాపొదొరొ గ్రామ కూడలిలో మావోయిస్టు బ్యానర్ కలకలం రేపింది. తెలంగాపొదొరొ నుంచి చంద్రపూర్‌కు వెళ్లే రహదారి కూడలిలో కనిపించింది. ఆంధ్ర–ఒడిశా జోనల్ కమిటీ పేరిట ఉన్న ఈ బ్యానర్‌లో ఖనిజ సంపదల దుర్వినియోగంపై రాసి ఉంది. మావో మద్దతుదారులు ఈ బ్యానర్‌ను కట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాయగడ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఫుల్బాణీ జిల్లాలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం. పోలీసులు దీనిని కొట్టిపారేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ మునిగుడ సమితిలో ఇటువంటి తరహా బ్యానర్ మళ్లీ దర్శనం ఇవ్వడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
అంధకారంలో చిన్నారులు..
రోడ్డు దాటించిన ట్రాఫిక్ పోలీసులు
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో సోమవారం రాత్రి కొందరు చిన్నారులు ట్రాఫిక్‌లో చిక్కుకుని రోడ్డు దాటలేని స్థితిలో భయంతో ఉండగా అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు మానవతా దృక్పథం చూపి ప్రజల ప్రశంసలు పొందారు. చీకటిలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న చిన్న పిల్లలను చూచిన ట్రాఫిక్ పోలీసు వెంటనే రెండు వైపుల నుంచి వస్తున్న వాహనాలన్నింటినీ నిలిపి రోడ్డు క్లియర్ చేసి పిల్లల చేతులు పట్టుకుని సురక్షితంగా రోడ్డు దాటించారు. ఈ సంఘటనను చూసిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు. విధులు నిర్వహిస్తూ మరో పక్క ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు చర్య తీసుకున్న ట్రాఫిక్ పోలీసు మిగతా పోలీసులకు ఆదర్శం అని కొనియాడారు.
మావోయిస్టు బ్యానర్ కలకలం
మావోయిస్టు బ్యానర్ కలకలం


